క్రైమ్/లీగల్

జగన్ పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తనపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను స్వతంత్ర సంస్థలతో చేయించాలని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణ అర్హతపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని హైకోర్టు తెలిపింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే దర్యాప్తు నివేదికను సమర్పించడానికి కొంత వ్యవధి కావాలని ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది కోర్టుకు విన్నవించుకోగా, ఈ నెల 13లోపు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ వాదనలను వినిపించడానికి న్యాయవాది శుక్రవారం కోర్టుకు హాజరు కానున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న జగన్‌పై విమానాశ్రయంలో శ్రీనివాసరావు ఆకస్మికంగా దాడి చేసిన విషయం తెలిసిందే.