క్రైమ్/లీగల్

కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 9: విధుల నుండి బహిష్కరించిన ఒక కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ సర్పవరం పరిధిలోని ఎపిఎస్‌పి బెటాలియన్ సమీపంలో నివసించే నూకా శివకృష్ణ(26) అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా దుశ్చర్తి పోలీస్ స్టేషన్‌లో పనిచేసేవాడు. అయితే అతను సుమారు గత నాలుగు సంవత్సరాలుగా విధులకు హాజరుకాకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు విధుల నుండి బహిష్కరించినట్లు తెలిసింది. కాకినాడ రూరల్ స్వామినగర్‌లో ఉన్న బంధువుల ఇంటి వద్ద శక్రవారం మధ్యాహ్నం సమారు రెండు గంటల సమయంలో శివకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటీన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈసంఘటనపై ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.