క్రైమ్/లీగల్

భార్యను హత్యచేసిన భర్తకు యావజ్జీవ కారాగారశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, నవంబర్ 9: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త రోకలిబండతో దారుణంగా హత్యచేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1200 జరిమానా విధిస్తూ గూడూరు ఏడవ అదనపు జిల్లా జడ్జీ ఎన్.శాంతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. సూళ్లూరుపేట గమళ్లవీధిలో వాటంబేడు వెంకటేశ్వర్లు భార్య రేఖతో కలిసి కాపురముంటున్నారు. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై భార్య రేఖతోపాటు ఇద్దరు పిల్లలను తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. 2014 సెప్టెంబర్ 27న మద్యం సేవించేందుకు భార్య రేఖను డబ్బులు ఇవ్వమనగా అందుకు ఆమె తిరస్కరించటంతో రోకలి బండతో రేఖను దారుణంగా కొట్టి హత్య చేశాడు. సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరచారు. వాదోపవాదాల అనంతరం వెంకటేశ్వర్లు చేసిన నేరం రుజువు కావడంతో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1200 జరిమానా విధించారు. ఈ కేసును ఏపీపీ వై.సుహాసిని వాదించారు.