క్రైమ్/లీగల్

జడ్జి ఇళ్లపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 14: సిరిసిల్ల పట్టణం, తంగళ్ళపల్లి గ్రామంలోని న్యాయమూర్తి వైద్య వరప్రసాద్ ఇండ్లపై ఏసీబీ దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న వైద్య వరప్రసాద్‌కు చెందిన ఇళ్ళపై, స్వగ్రామంలోని ఆయన కుటుంబ సభ్యుల ఇళ్ళపై బుధవారం ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం నాయకుడైన వరప్రసాద్ స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం కాగా, ఇక్కడ వారి పూర్వీకులు నిర్మించిన ఇంటిలో ఆయన సోదరుడు నివాసం ఉంటున్నాడు. సిరిసిల్ల పట్టణంలో వరప్రసాద్ తండ్రి, సీనియర్ న్యాయవాది వైద్య ఉమాశంకర్ ఉంటున్నారు. వరప్రసాద్‌కు హైదరాబాద్‌లో రెండు ఇళ్ళు ఉండగా, ఏకకాలంలో హైదరాబాద్, సిరిసిల్ల, తంగళ్ళపల్లిలోని ఇళ్ళపై ఏసీబీ దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగాయి. ఇళ్ళకు తలుపులు మూసుకుని ఏసీబీ అధికారులు లోపల సోదాలు నిర్వహించగా, మీడియాను అక్కడికి అధికారులు అనుమతించలేదు. సమారు ఏనిమిది మంది ఏసీబీ అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహించింది. అయితే ఈ సమయంలో వరప్రసాద్, ఆయన సోదరుడు అందుబాటులో లేరు. వరప్రసాద్ కుమారుడి వివాహం త్వరలో ఉన్న నేపథ్యంలో ఆ పనుల నిమత్తమై వీరు న్యాయమూర్తి వరప్రసాద్, ఆయన సోదరుడు ముంబై వెళ్ళినట్టు తెలిసింది. అయితే ఈ దాడులకు స్పష్టమైన కారణాలు వెల్లడించడం లేదు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం సృస్టించింది.