క్రైమ్/లీగల్

ఎల్‌హెచ్‌ఎమ్‌ఎస్ చేతికి చిక్కిన దొంగ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) నవంబర్ 16: అర్బన్ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అత్యంత సత్ఫలితాలు ఇస్తుంది. అర్బన్ పరిధిలో ఎక్కువ రోజులు ఇల్లు వదిలి బంధువులు, తీర్థయాత్రలు, శుభకార్యాలకు వెళ్లే వారు లాక్‌డ్ హౌస్ కెమేరాలు పెట్టుకుంటున్నారు. తాజాగా గుంటూరు అర్బన్ పరిధిలోని సంఘటన లాక్‌డ్‌హౌస్ కెమేరాల అవసరాన్ని తెలిపాయి. పాతగుంటూరు జంగా వారి వీధికి చెందిన మాలతీ తన స్వంత పనుల నిమిత్తం ఈనెల 2న బంధువుల ఇళ్లకు వెళ్లింది. వెళ్లే సమయంలో పోలీసులకు తెలిపి ఇంటికి లాక్‌డ్ హౌస్ కెమేరాలు ఏర్పాటు చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పాత నేరస్తుడు తాళ్లూరి దేశాయి ఆ ఇంటిలోకి ప్రవేశించి తచ్చాడుతూ లాక్‌డ్ హౌస్ కెమేరాను చూసి కెమేరా వైర్లు తొలగించాడు. అతని కదలికలు కెమేరాలో నమోదై పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం వెళ్లడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సదరు ఇంటి నుంచి పారిపోతుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా అర్బన్ ఎస్పీ సిహెచ్ విజయారావు లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించడంతో పాటు పలు లఘు చిత్రాలను సైతం నిర్మించి ప్రజలకు అవగాహన కలిగించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి అర్బన్ పరిధిలో లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పలువురు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడా ఎటువంటి చిన్న దొంగతనాలు జరగకుండా లాక్‌డ్ హౌస్ సిస్టమ్ అత్యంత విజయవంతంగా నడుస్తోంది. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ విజయారావు మాట్లాడుతూ లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌తో అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు. ఎవరైనా ఎక్కువ కాలం ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు సంబంధిత పోలీసుస్టేషన్‌కు సమాచారం అందిస్తే పోలీసులే నేరుగా ఇంటికి వచ్చి కెమేరాలు అమరుస్తారని ఎస్పీ తెలిపారు.