క్రైమ్/లీగల్

నగల వ్యాపారిని బెదిరించి రూ. ఐదున్నర లక్షలు స్వాహా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 17: నగల వ్యాపారి నుంచి డబ్బు డిమాండు చేసిన ఆరోపణల్లో గవర్నర్‌పేట సీఐ ఇ పవన్‌కుమార్‌రెడ్డి చిక్కుకున్నారు. వ్యవహారం నడిపిన జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ విష్ణుపై అదే స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. వెరసి పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నిందితుడు విష్ణును అరెస్టు చేసి రిమాండుకు తరలించగా సీఐ పవన్‌కుమార్‌రెడ్డిని వీఆర్‌కు పంపారు. దీంతో ప్రస్తుతం గవర్నర్‌పేట పోలీస్టేషన్ ఖాళీ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దశరథ్‌రామ్ అనే బంగారు వ్యాపారి తన డ్రైవర్‌తో ఈ నెల 15న నగలు కొనుగోలుకు సంబంధించి డబ్బును డిపాజిట్ చేసేందుకు విజయవాడ వచ్చాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన మఫ్టీ కానిస్టేబుల్ యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్‌ను పిలిచి వ్యాపారిని, డ్రైవర్‌ను గవర్నర్‌పేట పోలీస్టేషన్‌కు తీసుకొచ్చారు. మఫ్టీ కానిస్టేబుల్ వ్యాపారితో బేరాలకు తెరతీసి, బెదిరించి ఐదున్నర లక్షల రూపాయలు తీసుకుని పంపేశారు. దీంతో బాధితుడు సీపీకి ఫిర్యాదు చేయడంతో విచారణ చేయించిన మీదట నిజాలు నిర్థారణ కావడంతో కానిస్టేబుల్ విష్ణుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి స్టేషన్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డిని వీఆర్‌కు పంపారు. కాగా విచారణ అనంతరం ప్రమేయంపై లభించే ఆధారాలను పరిగణనలోకి తీసుకుని సస్పెండ్ చేసే అవకాశం లేకపోలేదని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.