క్రైమ్/లీగల్

365 గ్రాములతో బంగారం దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, నవంబర్ 17: తరచు చోరీలకు పాల్పడుతున్న మహమ్మద్ రఫీ (అలియాస్ జుబేర్) అనే దొంగను శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీయస్‌పి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైయస్‌నగర్‌లో నివాసము ఉంటున్న బొజ్జన అంటోని ఈనెల 5వ తేదీన కుటుంబ సభ్యులతో బెంగళూరు వెళ్తుండగా పోలీసుల వారితో ఎల్‌హెచ్‌ఎంఎన్ కెమరాను తన ఇంటిలో అమర్చుకొని బెంగళూరుకు కుటుంబసభ్యులతో వెళ్లారన్నారు. ఈనెల 11న అర్ధరాత్రి వారి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించగా పోలీసులు వారు ఏర్పాటు చేసిన కెమరా ద్వారా ఇంటిలోని అలారం మ్రోగగా 5 నిమిషాల్లో అక్కడికి పోలీసులు చేరుకోగా అప్పటికే ముద్దాయి పారిపోయాడని తెలిపారు. ఈ నెల 13వ తేదీ ఇంటి యజమాని బొజ్జ ఆంటోని ఇంటికి తిరిగిరాగా తమ ఇంటిలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశాడన్నారు. అతని ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి 7 గంటలకు బొల్లవరం వెంకటేశ్వరస్వామి దేవాలయంవద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి తన బుజానికి బ్యాగ్ తగిలించుకొని పోలీసులను చూసివెనక్కి తిరిగి పారిపోతుండగా సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నామన్నారు. అదుపులోనికి తీసుకున్న వ్యక్తి ఎల్‌హెచ్‌ఎన్‌ఎం కెమరాలో దొంగతనం చేసిన ముద్దాయిగా గుర్తించామన్నారు. ముద్దాయిని విచారించగా తను దొంగలించిన బంగారు, వెండి నగలు పట్టణంలోని వెంకటాద్రినగర్ కల్వర్ట్‌కింద బ్యాగ్‌తో సహా దాచివుంచినట్లు విచారణలో వెల్లడయ్యిందన్నారు. సదరు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకోగా బ్యాగులో 365 గ్రాముల బంగారం, 2,241 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని బంగారు, వెండి నగల విలువ దాదాపు రూ.12.45 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. అలాగే ముద్దాయివద్ద ఉన్న రూ.29 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.