క్రైమ్/లీగల్

తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 6: తిరుపతి, తిరుచానూరు, నెల్లూరు, కాకినాడ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ తమిళనాడుకు చెందిన అంతరాష్ట్ర దొంగ గిరిబాబు (34)ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 17,67,500 విలువచేసే 569 గ్రాముల బంగారు నగలు, కిలో 690 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి క్రైం సబ్ డివిజన్ డిఎస్పీ ఆర్.రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా, శ్రీపెరంబుదూర్ పట్టణం, భీమేశ్వర్ కోయిల్ వీధికి చెందిన గిరిబాబును సోమవారం సాయంత్రం రేణిగుంట-కడప రోడ్డులోని కరకంబాడి సమీపంలోవున్న కట్టపుట్టాలమ్మ గుడి వద్ద అరెస్టు చేశామన్నారు. నిందితుడు అతిమంజేరిపేట వద్ద ఫొటోస్టూడియో పెట్టుకుని జీవించేవాడని, ఆ తరువాత హూండాయ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడన్నారు. కృష్ణమూర్తి అనే వ్యక్తితో కలిసి చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడని చెప్పారు. జైల్లో ముత్తురాజ్, వేలు, మురుగన్, ముత్తు అనే వారితో పరిచయం ఏర్పరుచుకొన్న నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చాక 2015లో తిరుచానూరు, రేణిగుంట, వడమాలపేట, ఏర్పేడు, పుత్తూరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి అరెస్టై జైలుకు వెళ్లాడన్నారు. ఇక్కడ అతనికి పరిచయమైన కె.అచ్యుతరామరాజుతో కలిసి తమిళనాడులో చోరీలు చేసేవాడన్నారు. అచ్యుతరామరాజుకు ఫైనాన్స్‌లో పల్సర్ వాహనాన్ని కొనిచ్చిన గిరిబాబు అతనితో కలిసి తిరుపతిలో చోరీలకు పాల్పడ్డారన్నారు. అచ్యుతరామరాజు ఇళ్లలో చోరీలు చేస్తుంటే గిరిబాబు వెలుపల కాపలా ఉండేవాడని తెలిపారు. అచ్యుతరామరాజు కావలిలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడని, తనను పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో గిరిబాబు తన వద్ద బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను తీసుకుని కడప జిల్లాలో అమ్ముకునేందుకు కరకంబాడి రోడ్డు వద్ద ఉన్న కట్టపుట్టాలమ్మ ఆలయం వద్ద అనుమానాస్పద స్థితిలో ఉండగా తిరుపతి క్రైం సీఐ టి.మధు అతనిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. గిరిబాబుపై ఇప్పటికే తిరుపతి క్రైం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2, నెల్లూరు పట్టణ పరిధిలో 1, కాకినాడలో చోరీకి సంబంధించి 1కేసు నమోదై ఉన్నాయని డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి చెప్పారు. తన అవసరాల కోసం తమిళనాడులోని రెండు జ్యువలరీ షాపుల్లో కుదవపెట్టిన 195 గ్రాముల బంగారు నగలకు సంబంధించిన రశీదులను గుర్తించామన్నారు. మంగళవారం అతనిని కోర్టుకు హాజరుపరుస్తున్నామని డీఎస్పీ చెప్పారు. చోరీ సొత్తు రికవరీలో విశేష కృషి చేసిన సీఐ టి.మధుతోపాటు సీఐలు భాస్కర్ రెడ్డి, టి.అబ్బన్న, ఎస్‌ఐ రమేష్ బాబు, హెడ్‌కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్‌ను, నిందితుడికి సంబంధించిన సమాచారం సేకరించిన క్రైంపార్టీ ఇంచార్జ్ సీఐ టి.అబ్బన్న, ఐడీ పార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ విలేఖరుల సమావేశంలో క్రైం సీఐలు రసూల్ సాహెబ్, ఎ.పద్మలత, సి.్భస్కర్‌రెడ్డి, శరత్‌చంద్ర, మధు తదితరులు పాల్గొన్నారు.