క్రైమ్/లీగల్

ఖైదీలకు హక్కుల్లేవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: దేశంలో జైళ్లలో నెలకొన్న పరిస్థితులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో వివిధ శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను అధికారులు మనుషులుగానే చూస్తున్నారా అని సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా ప్రశ్నించింది. జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం జైళ్లలోని పరిస్ధితులు చూస్తుంటే ఖైదీలకు హక్కులున్నాయా? అని అడిగింది. దేశంలోని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీల్లో 48 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నయని, కేంద్రం విచారణ ఖైదీల కేసులను వేగంగా పరిష్కరించేందుకు ఏమి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది. ఇంతకీ అధికారులు ఖైదీలను మనుషులుగా చూస్తోందా ? మీ అధికారులను జైళ్లకు పంపించి అక్కడి పరిస్థితులను పరిశీలించమని చెప్పండి. ఇక కంటితుడుపు చర్యలు చాలు. కుళాయిలు పనిచేయడం లేదు. మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మురికినీటి పారుదల వ్యవస్థ సరిగాలేదు అని కోర్టు వ్యాఖ్యానించింది. జైళ్లలోని స్థితిగతులపై ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన నివేదికను కోర్టు విచారించింది. వీరు గత జూన్ నెలలో ఫరీదాబాద్ జైలును, మరో హోంను పరిశీలించారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ వాదనలు వినిపించారు. తమకు 19 రాష్ట్రాల నుంచి నివేదికలు వచ్చాయని తెలిపారు. అస్సాంలో జువెనైల్ జస్టిస్ బోర్డులకు, ఈ బోర్డులు విచారించే బాలనేరస్తులను ఉంచే హోంలకు మధ్య చాలా దూరం ఉందని, పిల్లలు బోర్డుకు వెళ్లలేకపోతున్నారని కోర్టు పేర్కొంది. ఈ పిల్లలు భారతీయ పౌరులనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం అమన్ లేఖీ వాదనలు కొనసాగిస్తూ ఫోరెన్సిక్ ల్యాబ్స్‌లో ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుని, ఈ ప్రక్రియ 20 ఏళ్లుగా కొనసాగుతోందని, రాజస్థాన్‌లో 50 శాతం పోస్టులు, గుజరాత్‌లో మూడో వంతు పోస్టులు, బిహార్‌లో 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. విచారణ ఖైదీల సమీక్ష కమిటీలు ఎలా పనిచేస్తున్నాయని కోర్టు ప్రశ్నించింది. అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వీరి స్థితిగతులు, జైలు నుంచివిడుదల తదితర అంశాలను రిటైర్డు కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాయ్ పరిశీలిస్తున్నారని తెలిపారు. జస్టిస్ రాయ్‌కు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారని కోర్టు అడిగింది. బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చి కార్యాలయంలో ఈ కమిటీ పనిచేస్తోందని అమికస్ క్యూరీ చెప్పారు. అనంతరం ఈ కేసును ఈ నెల 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
జైళ్లలో సమాంతర వ్యవస్థ పనిచేస్తోందా?
జైళ్లలో ప్రభుత్వంతో సమానంగా మరో వ్యవస్థ పని చేస్తోందా అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశంపై ఇద్దనరు అదనపు సెషన్స్‌కోర్టు న్యాయమూర్తులు సెప్టెంబర్ 4వ తేదీన తిహార్ జైలును సందర్శించి నివేదిక ఇచ్చారు. మీడియా రిపోర్టుల ఆధారంగా కోర్టు వీరిని తనిఖీ చేయాలని ఆదేశించింది. తిహార్ జైల్లో యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్ ఉన్న గదిలో లెడ్ టీవీ, సోఫా ఇతర నిషేధిత సదుపాయాలను అమర్చినట్లు వచ్చిన వార్తలపై కోర్టు న్యాయమూర్తుల కమిటీని నియమించింది. ఈ నివేదికపై కోర్టు గురువారం విచారించింది. జైళ్లలో యూనిటెక్ ప్రతినిధులకు ప్రత్యేక హ్కులు ఉన్నాయా, వారికి ఎందుకు విలాసవంతమైన సదుపాయాలు కల్పిస్తున్నారని జస్టిస్ మదన్ బీ లోకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం అడిగింది. అదనపు సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ వాదనలు వినిపిస్తూ ఇది నిజమైతే, ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ ప్రభుత్వం ఈ తరహా ఉదంతాలపై ఏమి చేస్తోందని కోర్టు ప్రశ్నించింది. తిహార్ జైళ్ల అధికారుల అవినీతి వల్ల జైల్లో అధికార దుర్వినియోగం జరుతగుతోందని న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.