క్రైమ్/లీగల్

హవాలా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 97 లక్షలు హవాలా సొమ్మును నార్త్‌జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 21న అర్ధరాత్రి సమయంలో మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అంతర్జాతీయ అహమ్మద్ టూరిస్టు అండ్ ట్రావెల్స్‌ను సిద్ధిక్ అహమ్మద్ నడుపుతున్నారు. కమీషన్ పద్ధతిలో అనుచరులతో దేశ, విదేశాల్లో ఉన్న వివిధ రంగాల వ్యాపారస్థులకు హవాలా ద్వారా భారీ ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తుంటారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అనుమానంతో సోదాలు చేయగా హవాలా గుట్టు బయటపడింది. టాస్క్ఫుర్సు డిప్యూటీ కమిషనర్ రాధాకృష్ణారావు, సీఐ నాగేశ్వరరావు, వర్లా జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.