క్రైమ్/లీగల్

దారిదోపిడీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 6: గచ్చిబౌలి ఐటీ సెక్టార్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున ఒం టరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులు, మరో బాలుడిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, 12 సెల్‌ఫోన్లు, నాలుగు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి న్యూ పీజేఆర్ నగర్‌లో నివాసముండే శ్రీకాంత్ (19), సాయికుమార్ (19), రాకేష్ (19) తోపాటు మరో బాలుడు ముఠాగా ఏర్పాడి దారి దోపిడీలు చేస్తున్నారని విశ్వప్రసాద్ తెలిపారు. ప్రముఖ ఐటీ కంపెనీలో పని ముగించుకుని వెళ్తున్న జ్యోతి శర్మను గచ్చిబౌలిలోని మహేంద్ర షోరూమ్ వద్ద నిందితులు అడ్డగించి 20వేలు విలువ చేసే ల్యాప్ టాప్, ఐ-్ఫన్, డెబిట్ కార్డులు లాక్కెళ్లారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ సమీపంలో నివాముంటున్న మహిళ.. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చుస్తుండగా బ్యాగ్‌తో తస్కరించారు. ఇలాంటి సంఘటనలు తరచు జరగుతుండడంతో ముడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. ఉదయం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా శ్రీకాంత్, సాయి కుమార్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా, రాయదుర్గంలో ఐదు, నార్సింగ్‌లో రెండు, గచ్చిబౌలిలో మూడు దోపిడీలు చేసినట్టు ఒప్పుకున్నారని డీసీపీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసిన రాయదుర్గం క్రైం బృందాన్ని అభినందించారు. మాదాపూర్ ఏసీపీ, శ్యామ్ ప్రసాద్ రావు, సీఐ రాంబాబు, డీఐ విజయ్ కుమార్, డీఎస్‌ఐ నదీమ్ పాల్గొన్నారు.