క్రైమ్/లీగల్

అసలెందుకు అరెస్ట్ చేశారు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ముందస్తుగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఉమ్మడి హైకోర్టు నిలదీసింది. బుధవారం న్యాయమూర్తులు రాఘవేంద్ర ఎస్ చౌహాన్, ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన హైకోర్టు ధర్మాసనం రేవంత్ కేసును విచారించింది. ఈకేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. రేవంత్ అరెస్టుకు ముందు..తర్వాత జరిగిన పరిణామాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని కోర్టు సూచించింది. కాంగ్రెస్ నేత రేవంత్ అరెస్టు విషయంలో పోలీసుల ప్రవర్తన, పర్యవేక్షణలో లోపాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని న్యాయమూర్తులు అన్నారు. ఇలాంటి సంఘటనల్లో ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయో
అన్న ఆలోచన పోలీసులకు ఉందా?అని ప్రశ్నించింది. రేవంత్ అరెస్టుకు సంబంధించిన నివేదికల్లో సంతకాలు, తేదీలు, అధికారిక ముద్రలు ఎందుకులేవని బెంచ్ అడిగింది. ఈ అరెస్టును ఎలా సమర్ధించుకుంటారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఇచ్చిన సమాచారం మేరకు తానే వౌకిక ఆదేశాలు ఇచ్చానని డీజీపీ మహేందర్‌రెడ్డి కోర్టుకు వివరించారు. కేవలం నిఘావర్గాల సూచనల మేరకు ఆదేశాలు జారీ చేస్తారా? వాటిని ప్రాథమికంగా విచారించాల్సిన అవసరం లేదా? అంటూ కోర్టు డీజీపీని నిలదీసింది. అత్యవసరాల సమయాల్లో సంతకాలు, ముద్రలు తీసుకునే ప్రక్రియ రాష్ట్ర వ్యవస్థలో లేదని డీజీపీ వివరణ ఇచ్చారు. కేసును ఈనెల 17వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశించింది.
ఎస్పీ అన్నపూర్ణ బదిలీ.. కొత్త ఎస్పీ అవినాష్ మోహంతి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అరెస్ట్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్‌గా వ్యవహరించింది. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్ జిల్లా పరిధిలో ఉంది. దాంతో వికారాబాద్ పోలీస్ సూపరింటెండెంట్ టి. అన్నపూర్ణను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అన్నపూర్ణ స్థానంలో ఐపీఎస్ అధికారి అవినాష్ మోహంతిని నియమించారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకే అన్నపూర్ణ నుండి అవినాష్ మోహంతి చార్జీ తీసుకోవాలని, వికారాబాద్ ఎస్‌పీగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. అన్నపూర్ణ వెంటనే పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్ చేయాలని కూడా సూచించారు. అన్నపూర్ణ సేవలను ఇక ముందు ఎన్నికల కోసం వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్నపూర్ణ తన బాధ్యతలను అవినాష్‌కు అప్పగించి, పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆ విషయంపై ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు, ప్రభుత్వం వేధిస్తోందని, అక్రమ కేసులు పెడుతోందని, అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వెంటనే స్పందించి, చర్య తీసుకోవడంతో వికారాబాద్ ఎస్‌పీ బదిలీ అయ్యారు.