క్రైమ్/లీగల్

ఇంకెంతమంది చనిపోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రహదారులపై గుంతల వల్ల ప్రమాదాలు జరిగి ఎందరో చనిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టులేదని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సరిహద్దులో కాల్పుల్లో చనిపోతున్నవారికంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదని బెంచ్ హెచ్చరించింది. దేశ వ్యాప్తంగా రహదారులపై గుంతలు పూడ్చకుండా వదిలేయడంతో నిత్యం ఏదోమూల ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయని జస్టిస్ మదన్ బీ లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా ప్రమాదాల్లో గత ఐదేళ్లలో 14,926 మంది మృతి చెందారని, ఇవి ఓ విధంగా సరిహద్దులో సంభవిస్తున్న మరణాల కంటే ఎక్కువని బెంచ్ తెలిపింది. ఇంకెంత మంది చనిపోతే ప్రభుత్వం చలిస్తుందంటూ జస్టిస్ దీపక్‌గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. 2013 నుంచి 17 వరకూ ఏటేటా మరణాలు పెరుగుతునే వచ్చాయని కోర్టు స్పష్టం చేసింది. రహదారులు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారుల భద్రతపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కేఎస్ రాధాకృష్ణన్ అధ్యక్షత గల కమిటీ నివేదికపై స్పందనేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూలై 20 రహదారుల గుంతలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రదాడి కంటే ప్రమాదంగా ఈ మరణాలున్నాయని కోర్టు విమర్శించింది. అమాయక ప్రజలే రోడ్ ప్రమాదానికి బలైపోతున్నారని బెంచ్ తెలిపింది. విలువైన ప్రాణాలు గాలిలోకలిసిపోతున్నా నష్టపరిహారం ఇచ్చి అధికారుల చేతులు దులుపుకొంటున్నారని కోర్టు ఆక్షేపించింది. రహదారుల నిర్వహణ సరిగ్గాలేకపోబట్టే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని బెంచ్ మండిపడింది. ఇవన్నీ చూస్తుంటే విధుల నిర్వహణలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని సుప్రీం పేర్కొంది. ‘టెర్రరిస్టుల దాడుల కంటే ఈ ప్రమాదాలు ఎక్కువ. అనేక మంది బలైపోతున్నారు’ అని ధర్మాసనం తెలిపింది. రహదారుల భద్రతా కమిటీ నివేదికను తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది.