క్రైమ్/లీగల్

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, డిసెంబర్ 15:డోన్ ప్రాంతంలో అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలివెళ్తున్న రేషన్ బియాన్ని శనివారం తెల్లవారుజామున డోన్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. పట్టణంలోని ఎంవీఐ కార్యాలయ సమీపంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా డోన్ పట్టణ సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అలాగే లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 28 టన్నుల బియ్యాన్ని, గోడౌన్‌లో వున్న తూనికల మిషన్, తూకాల రాళ్లు, సంచులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మురళీకృష్ణను అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ వివరించారు.