క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో హైవే దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిపాడు, డిసెంబర్ 18:జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాల్లో నగదు, వస్తువులను దొంగతనం చేస్తున్నవారిని మంగళవారం గ్రోత్ సెంటర్ వద్ద పట్టుకున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ ఒ దుర్గాప్రసాదు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ గత సంవత్సరం కాలంనుండి మండల పరిధిలోని జాతీయ రహదారిపై దొడ్డవరప్పాడు, వెల్లంపల్లి, గుండ్లాపల్లి దాబాల వద్ద జరిగిన దొంగతనాల్లో ఏడు సెల్‌ఫోన్లకు గాను ఐదు సెల్‌ఫోన్లు, 3.12లక్షలరూపాయలకు గాను 1.75లక్షల రూపాయల నగదును, స్తిరాస్థికి సంబంధించిన దస్తావేజులనుండి ఇద్దరు నిందితులనుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన కావటి క్రాంతికుమార్ అలియాస్ కాంతి, పీరిగ రమేష్ అలియాస్ చిన్న రమేష్‌గా గుర్తించినట్లు తెలిపారు. మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌పి బి సత్యఏసుబాబు ఉత్తర్వులు మేరకు డిఎస్‌పి రాధేష్‌మురళీ ఆదేశాలతో ఈ దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు.
స్థానిక ఎస్‌ఐ వారి బృందం నిందితులను పట్టుకోవటంలో చాకచాక్యంగా వ్యవహరించారని ఈ కేసును చేధించిన కానిస్టేబుల్స్ అనిల్,కిశోర్‌లను సిఐ అభినందించారు. గతంలో జరిగిన ఇళ్ల దొంగతనాలు, జాతీయ రహదారిపై జరిగిన దొంగతనాలను త్వరలో చేధించనున్నట్లు, మండల పరిధిలోని ప్రధాన కూడళ్లల్లో జాతీయ రహదారిపై ఉన్న దాబాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నట్లు సిఐ తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ బి సురేష్, ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాసరావు, రైటర్ ఎన్‌వి రమణారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.