క్రైమ్/లీగల్

వ్యాపారవేత్త ఇంట్లో రూ. 56లక్షలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 19: రాజమహేంద్రవరంలోని ఎవి అప్పారావురోడ్డులో నివసించే వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈసంఘటన 3రోజుల క్రితమే జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఎవి అప్పారావురోడ్డులోని ఎస్‌ఎస్‌కె ప్లాజా అపార్ట్‌మెంట్‌లో నివసించే వడ్డి మల్లిఖార్జునప్రసాద్ కోరుకొండలోని ఆస్తిని అమ్మగా వచ్చిన రూ. 56లక్షలు, బ్యాంకులో డ్రా చేసిన సొమ్ము కలిపి మొత్తం రూ. 58లక్షలను బీరువాలో దాచి ఉంచారు. ఈనెల 16న తన కుటుంబంతో కలిసి తణుకు వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి చేరే సరికి బీరువాలోని రూ. 56లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. మిగిలిన 2లక్షలను దొంగలు బ్యాగులో పట్టక వదిలేసినట్లు భావిస్తున్నారు. మల్లిఖార్జునప్రసాద్ ఇంటి అనుపానులు తెలిసిన వారే ఈచోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈచోరీకి సంబంధించి ఇప్పటికే పోలీసులు రూ. 10లక్షలు రికవరీ చేసినట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని అర్బన్ ఎస్పీ షిమోషీబాజ్‌పేయి సందర్శించి, సుమారు 2గంటల పాటు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించడం గమనార్హం. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది. ప్రకాష్‌నగర్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.