క్రైమ్/లీగల్

కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 22: కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు పెద్ద దెబ్బతగిలింది. ఆల్ ఖాయిదా గ్రూపుకు చెందిన వారుగా చెప్పుకుంటున్న ఆరుగురు ఉగ్రవాద ము ష్కరులు భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కరడు గట్టిన ఉగ్రవాది జకీర్ ముసా మరణించాడు. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారని పోలీస్ ఐజీ స్వ యం ప్రకాశ్ పాని చెప్పారు. వీరందరి కోసం కొంతకాలంగా భద్రతా బలగాలు, పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టినట్లు ఆయన చెప్పారు. వీరం తా అన్సార్ ఘాజావతుల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారు. ఆల్ ఖాయిదా బ్యానర్‌పై ఈ ఉగ్రవాదులు దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పుల్వమా జిల్లాలో ఆరంపురా గ్రామం వద్ద పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా ఈ ఎన్‌కౌంటర్ ఘటన జరిగింది. కొంతసేపు పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య పరస్పరం కాల్పు లు జరిగాయి. హతమైన వారిలో మహమ్మద్ అకూన్, ఫసల్ అహ్మద్ కండే, నదీం అహ్మద్ సోఫీ, రసీక్ మీర్, రవుఫ్ మీర్, ఉమర్ రంజాన్ ఉన్నారు. వీరందరికీ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు చె ప్పారు. వీరిపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయి. అనేక దేశ ద్రోహ ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా రు. మృతుల మృతదేహాలను వారి కు టుంబ సభ్యులకు పోస్టుమార్టమ్ తర్వాత అప్పగించారు. ఘటన ప్రదేశంలో కీలక మైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.