క్రైమ్/లీగల్

మల్టీలెవెల్ మోసాలు.. ఇద్దరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, డిసెంబర్ 24: భక్తి ముసుగులో మల్టీలెవెల్ పేరుతో వ్వాపారాలు ఉన్నాయని అమాయక ప్రజలను మోసం చేసిన దొంగ బాబాతో పాటు అతని సోదరుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నాలుగు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు మోబైల్ ఫోన్ల్, ల్యాప్ ట్యాప్, ఐదు ఇండియన్ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జాయింట్ సీపీ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన కమార్ గిరీష్ సింగ్ స్వామిజీ (34) సోదరుడు దిలిప్ సింగ్ (29) నగరంలోని మాదపూర్, అయ్యప్ప సోసైటీలో నివాసం ఉంటున్నారు.
చిన్న వయస్సు నుంచి ఐటెక్ మోసాలకు అలవాటు పడిన గిరీష్ సింగ్ పలు వ్యాపారాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ వారి వద్ద రూ.50కోట్ల నుంచి రూ.60కోట్లను వసూలు చేశాడు. ఇటీవల మూడు కోట్లు ఖర్చు చేసి దివ్య అనే యువతిని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా వివాహం చేసుకున్నాడు.
గిరీష్ సింగ్ నాగోలులో నివాసం ఉంటున్న స్వప్న వద్ద రూ. 21లక్షలు వసూలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత స్వప్న తన డబ్బులు కావాలని గిరీష్ సింగ్‌ను అడగగా ఇవ్వనని తెగేసి చెప్పి బెదిరించాడు. ఎల్బీనగర్ పోలీసులకు స్వప్న ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి గిరీష్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విఛారించగా తాము చేస్తున్న మోసాలను పోలీసులకు వివరించారు. గిరీష్ సింగ్‌తో పాటు అతని సోదరుడు దిలీప్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.