క్రైమ్/లీగల్

‘నిఘా’ ఆదేశాలపై సుప్రీంలో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రజల కంప్యూటర్లు, మానిటర్లు, సమాచార వ్యవస్థపై నిఘా పెడుతూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పది జాతీయ దర్యాప్తు సంస్థలకు కేంద్ర నిఘా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసింది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20న ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ న్యాయవాది మమోహర్ లాల్ శర్మ సోమవారం సుప్రీం కోర్టులు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం కిందే తామీ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోమ్‌శాఖ సమర్ధించుకుంది. ఇంటిలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కం టాక్స్, డీఆర్‌ఐ, సీబీఐ, ఎన్‌ఐఏ, రా, డెరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటిలిజెన్స్, ఢిల్లీ పోలీసు కమిషన్‌కు ‘నిఘా’ అధికారాలు కేంద్రం అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర శర్మ ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పిల్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.‘రాజకీయ విరోధులు, నచ్చని వారి నోళ్లు నొక్కేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక విధంగా ఎమర్జెన్సీని తలపిస్తోంది’అని న్యాయవాది శర్మ పేర్కొన్నారు.