క్రైమ్/లీగల్

అంత అర్జంట్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై బీజేపీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాలన్న బీజేపీ తరఫు లాయర్ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను సుప్రీం సాధారణ కేసుగానే పరిగణించిందని లాయర్ల అసోసియేషన్ వెల్లడించింది. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ప్రారంభించాలనుకున్న రథయాత్ర హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. సుప్రీంలో దీనిపై వెంటనే విచారణ జరుపుతారని ఆశించిన బీజేపీకి చుక్కెదురైంది. శీతాకాలం సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవులు రానున్నాయి. రథయాత్రకు అనుమతించిన సింగిల్ జడ్జి ఆర్డర్‌పై మమతా బెనర్జీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. చీఫ్ జస్టిస్ దేబషీష్ కార్‌గుప్తా, జస్టిస్ షంపా సర్కార్ కూడిన ఈ డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఆర్డర్‌ను నిలిపివేస్తూ రథయాత్రకు అనుమతి నిరాకరించడంతో బీజేపీ సుప్రీంను ఆశ్రయించింది. ‘సేవ్ డెమొక్రసీ’ పేరుతో పశ్చిమ బెంగాల్‌లోని 42 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తూ బీజేపీ రథయాత్ర నిర్వహించాలని భావించిన విషయం తెలిసిందే.