క్రైమ్/లీగల్

దొంగ బాబా ఆట కట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: దొంగ బాబా ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు. అథ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న గిరీష్ సింగ్ దొంగ బాబాను అరెస్టు చేసినట్లు రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. బాబాగా అవతారం ఎత్తి భక్తుల అథ్యాత్మిక కార్యక్రమాల కోసం విరాళాలు సేకరించినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి సుమారు రూ.50 నుంచి 60 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆయన వివరించారు.
అంతేకాకుండా యాప్స్ డెవలప్‌మెంట్ పేరిట సాప్ట్ వేర్ కంపెనీని స్థాపించి ఉద్యోగాల పేరిట 300 మంది నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. కొంత మంది బాధితులు బాబా చేస్తున్న మోసాల గురించి తమ దృష్టికి తేవడంతో, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని ఆయన చెప్పారు.