క్రైమ్/లీగల్

కోడి పందెం స్థావరాలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,డిసెంబర్ 25: మండలంలోని దుగ్గనపల్లి వ్యవసాయ పొలాల్లో పలుకుబడి ఉన్న రాజకీయ వ్యక్తి స్థలంలో కోడిపందేలు ఆడుతున్న విషయాన్ని తెలుసుకుని కడప,చెన్నూరు పోలీసులు మఫ్టీలో మూకుమ్మడిగా దాడిచేసి లక్షరూపాయలు నగదు, 20కోడికత్తులు, 10కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 25మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈసంఘటన సోమవారం సాయంత్రం 6గంటలకు జరిగింది. మూకుమ్మడిగా కోడిపందేల జూదరులను అరెస్టు చేయడంతో సంచలానికి దారితీసింది. చెన్నూరు, కమలాపురం,ఖాజీపేట, వల్లూరు, సికె దినె్న మండలాలకు చెందిన పందెం రాయుళ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో కడప సిఐ హమీద్‌ఖాన్, చెన్నూరు ఎస్‌ఐ రవికుమార్, కడప,చెన్నూరు పోలీసులు పాల్గొన్నారు. జూదరులను అరెస్టుచేసి చెన్నూరు పోలీసుస్టేషన్‌కు తరలించగా, అరెస్టయిన వారందరూ తెలుగుదేశం, వైసీపీ నాయకులు ఉండటం విశేషం. అయితే ఈవిషయంపై స్థానిక పోలీసులను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామన్నారు.

25 బస్తాలు గుట్కా ప్యాకెట్లు పట్టివేత
* ఇద్దరు వ్యక్తులు అరెస్టు
* ఒక వాహనం స్వాధీనం
చాపాడు, డిసెంబర్ 25: ముంబై - నెల్లూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 15 బస్తాలు గుట్కా, 10 బస్తాలు కైనీని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఒక వాహనాన్ని స్వాధీన పరుచుకున్నట్టు ఎస్‌ఐ నరేంద్రకుమార్ తెలిపారు. దీనిపై ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రాగులపాడు ఉమాపతి, కందుల శివప్రసాద్, మరో వ్యక్తి కలిసి బెంగళూరులోని కానపల్లె నుంచి 15 బస్తాలు గుట్కా, 10 బస్తాలు కైనీ ప్యాకెట్లును కొనుగోలు చేశారన్నారు. వాటిని ఆర్ ఎక్స్ జవాన్ వాహనంలో మైదుకూరుకు ముగ్గురు వ్యక్తులు తరలిస్తున్నారన్నారు. చాపాడు మండల పరిధిలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలియచేశారు. ఈ ముగ్గరిలో ఒకరు తప్పించుకుని పారిపోగా ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నామన్నారు. పట్టుబడ్డ సరుకు విలువ రూ.2.30 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ఆ సరుకుతో పాటు ఉమాపతి, శివప్రసాద్‌ను అరెస్ట్ చేసి మైదుకూరు కోర్టుకు హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించామని నరేంద్ర కుమార్ తెలిపారు.

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
దువ్వూరు, డిసెంబర్ 25: మండల పరిధిలోని ఎకోపల్లె గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్టు ఎస్‌ఐ శివశంకర్ యాదవ్ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఏకోపల్లె వద్ద మంగళవారం తనిఖీ నిర్వహిస్తుండగా కానగూడూరు గ్రామానికి చెందిన రమణయ్య, ఎకోపల్లె గ్రామానికి చెందిన సుబ్బారావు, దువ్వూరు గ్రామానికి చెందిన శివయ్య 5,900కి పైగా గుట్కా, కైనీ ప్యాకెట్లను తరలిస్తున్నారు. వీటిని పట్టుకొని సీజ్ చేశామన్నారు. వీటి విలువ 30 వేల రూపాయలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్‌ఐ నాగన్న, పోలీసులు ఫకీరయ్య, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
నాటుసారా స్థావరాలపై దాడులు
* 1,500 లీటర్ల ఊట ధ్వంసం
సుండుపల్లె, డిసెంబర్ 25: నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి ఊటను ధ్వంసం చేసినట్లు రాయచోటి ఎక్సైజ్ సీఐ రామమోహన్ తెలిపారు. మంగళవారం మండలంలోని భాగంపల్లె, కుప్పగుట్ట, హరిజనవాడ గ్రామాల సమీపంలో నాటుసారా బట్టీలను ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. పల్లెల్లో సారాబట్టీలు మండుతున్నాయని విశ్వసనీయ సమాచారం రావడంతో సుండుపల్లెలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నాటుసారాను నిషేధించాలని, సారా రహిత గ్రామాలే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంటే కొంత మంది అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై గతంలోనూ కఠినచర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం 1,500 లీటర్లకు పైగా ఊటను ధ్వంసం చేశామన్నారు. సారా తయారీ స్థావరాల నుండి డ్రమ్ములను స్వాధీనపరచుకున్నామన్నారు. అయితే ఈ దాడుల్లో ఎవరూ పట్టుబడలేదన్నారు. ఎవరైనా గ్రామాల్లో సారా తయారీపై మొగ్గు చూపితే సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.