క్రైమ్/లీగల్

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నగొట్టిగల్లు, డిసెంబర్ 26: భాకరాపేట అటవీప్రాంతంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కూంబింగ్‌లో యర్రావారి పాళ్యెం మండలం, మట్టివారి పల్లెకు చెందిన షేక్ రియాజ్ బాషాను అరెస్టు చేశామని, పారిపోయిన మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని భాకరాపేట అటవీ రేంజ్ ఆఫీసర్ కె.రఘునాథ్ చెప్పారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తమకు అందిన పక్కా సమాచారంతో నెరబైలు సెక్షన్ ఆఫీసర్ వేణు తన సిబ్బందితో మంగళవారం రాత్రి 8 గంటలకు తలకోన సెంట్రల్ బీట్‌లోని ఎలమచెట్ల దడి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామన్నారు. ఈ సమయంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధంగా ఉండటాన్ని గమనించి లొంగిపోవాలంటూ హెచ్చరించామన్నారు. స్మగ్లర్లు చీకటిలో అటవీ ప్రాంతంలోకి పారుపోతుండగా వారిని వెంటాడి షేక్ రియాజ్ బాషాను పట్టుకున్నారని తెలిపారు. పారిపోయిన వారిలో ఇదే మండలంలోని పులిగోనుపల్లికి చెందిన కె.వెంకటసిద్దులు, కె.సాయి, ఎన్.శివ, బి.ఎల్లారెడ్డి, బి.సోమశేఖర్ రెడ్డిలుగా గుర్తించామని తెలిపారు. వీరికోసం గాలిస్తున్నామన్నారు. అరెస్టు చేసిన షేక్ రియాజ్ బాషాను పాకాల కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ దాడుల్లో నెరబైలు బీట్ ఎఫ్‌ఎస్వో ఎస్.వేణు, ఎఫ్‌బీఓలు ఆర్.జ్యోతి, ఎం.వినోద్ కుమార్, జి.వందన్ కుమార్, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.