క్రైమ్/లీగల్

వికలాంగుల కోటాను విస్మరిస్తారా?: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక ప్రక్రియలో స్పోర్ట్సు, వికలాంగుల కోటాను విస్మరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై హైకోర్టులో బుధవారం నాడు వాదనలు జరిగాయి. స్పోర్ట్సు, వికలాంగుల కోటాను సరిచేసిన తర్వాతనే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ సెక్రటరీల నియామకాలపై ఉన్న స్టే ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులపై 14 ప్రశ్నలకు తెలుగులో కాకుండా ఆంగ్లంలో ఇవ్వడంపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తప్పులను ఒప్పుకోకుండా ఎందుకు మేనేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

చిత్రం.. హైకోర్టు