క్రైమ్/లీగల్

రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, డిసెంబర్ 26: ఎల్బీనగర్ డీసీపీ జోన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు, దాదాపు 15 తులాల బంగారు ఆభరణాల దొంగలింపు. బుధవారం ఎల్బీనగర్ డీసీపీ పరిధిలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి వైదేహినగర్‌లో లక్ష్మీ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా 4.5 తులాల బంగారు గొలుసును దుండగులు దొంగలించారు. హస్తినపురం ఈస్ట్‌లో విజయమ్మ అనే మహిళ కూరగాయలకోసం నడుచుకుంటూ వెళ్తుండగా 5.5 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అనుపమ నగర్, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బీడీ రెడ్డి గార్డెన్ సమీపంలో మణేమ్మ అనే మహిళ మెడలోనుంచి 3.5 తులాల బంగారు గొలుచును చైన్ స్నాచర్లు అపహరించినారు. ఒకేసారి నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ సంఘటనలు జరగటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.