క్రైమ్/లీగల్

రహదారులు రక్తసిక్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాదెండ్ల/దాచేపల్లి, డిసెంబర్ 26: గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. నాదెండ్ల మండలంలో సాతులూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా, దాచేపల్లి మండలంలో కంటైనర్ లారీని కారు డీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం 113తాళ్ళూరు గ్రామానికి చెందిన తూమాటి దీనరాజు (22), మేళం జ్ఞానయ్య (21), ద్విచక్ర వాహనంపై ఫిరంగిపురం చర్చి తిరునాళ్ళకు మంగళవారం రాత్రి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున పొనుగుపాడు గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి, అదే వాహనంపై ఫిరంగిపురం బయలుదేరారు. సాతులూరు గ్రామం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో దీనరాజు, జ్ఞానయ్యతో పాటు గేరా రవీంద్రబాబు (22) అక్కడికక్కడే మృతి చెందారు. పొగమంచు కావడంతో మృతదేహాలపై వాహనాలు వెళ్ళడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఎస్‌ఐ రామాంజనేయులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇలాఉంటే దాచేపల్లి పట్టణంలోని భవ్య పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున దట్టంగా పొగ మంచు అలుముకున్న నేపథ్యంలో దారి కనపడక వేగంగా వెళుతున్న మారుతీకారు ముందు వెళుతున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు.
దాచేపల్లి ఎస్‌ఐ మహ్మద్ రఫీ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో నివాసం వుంటున్న బిపిన్(35) ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ వుంటాడు. తెనాలిలో వుంటున్న తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని తెలియటంతో తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలతో కలసి మారుతి కారులో హైదరాబాద్ నుండి తెనాలి బయలు దేరాడు. రోడ్డుపై బాగాపొగ మంచు కమ్ముకుని ఉండటతో దారి సరిగా కనిపించక ముందు వెళ్తున్న కంటైనర్ లారీని డీకొట్టాడు. ఈప్రమాదంలో బిపిన్ (35), అతడి తండ్రి పరంజ్యోతి (60) అక్కడికక్కడే మృతి చెందారు. బిపిన్ భార్య చైతన్య పరిస్థితి విషమంగా వుండటంతో ఆమెను మెరుగైన చికిత్సకోసం పిడుగురాళ్ళ తరలించారు.
అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమార్తె ఏంజెల్, కుమారుడు ఆర్మూర్ క్షేమంగా ప్రమాదం నుండి బయట పడ్డారు. ఈ మేరకు దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద కంటైనర్ లారీని ఢీకొన్న కారు