క్రైమ్/లీగల్

వరస స్నాచింగ్‌లతో వణికిపోతున్న ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, డిసెంబర్ 27: వనస్థలిపపురం పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్‌లు రెండవ రోజు కూడా రెచ్చిపోయారు. బుధవారం రోజున జరిగిన రెండు చైన్ స్నాచింగ్‌లు మరవక ముందే గురువారం రోజుకుడా వనస్థలిపురంతో పాటు ఎల్బీనగర్ డీసీపీ పరిధిలోని చైతన్యపురి, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లలో స్నాచర్స్‌లు మరోసారి విజృంభించారు. రెండు రోజులుగా వరస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దిక్కుదోచని స్థితిలో రాచకొండ పోలీసులు కంటికి నిద్ర లేకుండా స్నాచర్స్ కోసం గాలిస్తూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
రెండేళ్ల నుంచి నగరంతో పాటు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలకు తగ్గడంతో ప్రజలు, పోలీసులు ప్రశాంతంగా గడిపారు. ఎల్బీనగర్ డీసీపీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటికే పెద్ద ఎత్తున సీసీ కేమారాలను ఏర్పాటు చేయించడంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రద్దీగా ఉండే ప్రధాన చౌరస్తాలలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో పోలీసు ఉన్నత అధికారులు పూర్తి స్థాయిలో సఫలమయ్యారు. రెండు రోజులుగా ఎల్బీనగర్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్లను సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారు. మహిళలు తాము చెప్పిన సూచనలను పాటించి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
మన్సూరాబాద్‌లో స్నాచింగ్
వాకింగ్ చేస్తున్న మహిళల మెడలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కెల్లిన సంఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మన్సూరాబాద్ డివిజన్, ఇందిరా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న గృహిణి గుర్రం ధణలక్ష్మీ (40) గురువారం తెల్లవారుఝామున వాకింగ్ కోసం నడుచుకుంటూ వెళ్తుండగా ఎంఈరెడ్డి గార్డెన్ రోడ్డులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. బాధితురాలు వెంటనే వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు వెల్లడించారు.