క్రైమ్/లీగల్

ఉగ్రవాద అనుమానితులకు 12 రోజుల కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశంలో భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనుకున్న ఏసీస్ ఉగ్రవాద అనుమానితులను 12 రోజుల పోలీసుకస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది మంది ఉగ్రవాద అనుమానితులను ఎన్‌ఐఏ పోలీసులు బుధవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిని ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ పదిమంది ఆత్మహుతిదాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారని ఎన్‌ఐఏ పోలీసులు కోర్టుకు చెప్పారు. 15 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. నిఘా సమాచారం మేరకు పక్కా ఆధారాలతో వీరిని అరెస్టు చేశామన్నారు. కాగా వీరిని పోలీసు కస్టడీకి అప్పగించడాన్ని డిఫెన్స్ న్యాయవాది ఎంఎస్ ఖాన్ వ్యితిరేకించారు. కాగా వచ్చే నెల 8 వ తేదీన కోర్టులో కస్టడీ అనంతరం హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఉగ్రవాద అనుమానితులను కోర్టులో హాజరుపరిచే సమయంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అదనపు సెషన్స్ జడ్జి అజయ్ పాండే వీరిని విచారిస్తున్న సమయంలో కోర్టులో ఎవరిని అనుమతించలేదు. అరెస్టయిన వారిలో మఫ్టీ మహ్మద్ సుహాలీ, అనాస్ యూనస్, రషీద్ జఫర్, సరుూద్, రారుూస్ అహ్మద్, జుబేర్ మాలిక్, జాయిడ్, సాకిబ్ ఇఫ్తేకర్, ఇర్షాద్, అజామ్ తదితరులు ఉన్నారు. విచారణ అనంతరం కుటుంబ సభ్యులను నిందితులతో మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. ఢిల్లీ, మీరట్, లక్నో, అమ్రోహా తదితర చోట్ల అనేక ప్రదేశాల్లో ఎన్‌ఐఏ పోలీసులు గత రెండు రోజులుగా దాడులు నిర్వహించి, సోదాలు చేసి ఉగ్రవాద అనుమానితులను పట్టుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా వీరి వద్దనుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను, రాకెట్ లాంచర్, బుల్లెట్లు, కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.