క్రైమ్/లీగల్

31న లొంగిపోనున్న సజ్జన్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ ఈ నెల 31వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోనున్నారు. ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదును విధించింది. లొం గిపోయేందుకు డెడ్‌లైన్‌ను పొడిగించేందుకు కోర్టు నిరాకరించిన విషయం విదితమే. ఈ కేసులో అప్పీల్ చేయాలని స్జన్కుమార్ న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. కాని సుప్రీంకోర్టు ఈ కేసులో సజ్జన్ కుమార్‌కు ఊరట ఇస్తుందనేందుకు నమ్మకాలు సన్నగిల్లాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ క్లైంటు శిరసావహిస్తారని సజ్జన్‌కుమార్ తరఫున న్యాయవాది అనిల్ కుమార్ శర్మ చెప్పారు. ఈ నెల 17వ తేదీన సిక్కు ఊచకోత అల్లర్ల కేసులో సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదును విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సజ్జన్‌కుమార్ వయస్సు 73 సంవత్సరాలు. ఈ కేసులో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దేశ విభజన జరిగినప్పటి నుంచి 1993లో ముంబయిలో, గుజరాత్‌లో 2002లో, ముజఫర్‌నగర్‌లో 2013లో అల్లర్లు జరిగాయని, మైనార్టీలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని పేర్కొంది. ఈ అల్లర్లకు పెద్ద రాజకీయ నేతల మద్దతు, పోలీసుల అండ ఉన్నాయని కోర్టు పేర్కొంది. దక్షిణ ఢిల్లీలో పాలం కాలనీలో రాజ్‌నగర్ ఏరియాలో ఐదుగురు సిక్కుల ఊచకోత కేసులో సజ్జన్‌కుమార్‌కు జైలుశిక్ష పడింది. కోర్టు ఎదుట లొంగిపోయేందుకు గడువు జనవరి 30వరకు అనుమతించాలని సజ్జన్ కుమార్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.