క్రైమ్/లీగల్

కోర్టు ఆవరణలో జడ్జిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్: కోర్టు ఆవరణలో సెషన్స్ జడ్జిపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాడి చేసిన సంఘటనను బొంబాయి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి సంఘటనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదకరమని హైకోర్టు నాగపూర్ బెంచి వెకేషన్ కోర్టు జడ్జి ఆర్‌కె దేశ్‌పాండే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ జిల్లా సెషన్స్ కోర్టులో బుధవారం మధ్యాహ్నం ఏడో అంతస్తులో లిఫ్ట్ బయట సీనియర్ సివిల్ జడ్జి కెఆర్ దేశ్‌పాండేతో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేష్ పరాటే ఒక కేసు విషయమై గొడవపడి అతని చెంప చెళ్లుమనిపించాడు. అనంతరం దినేష్ సంఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, అక్కడ ఉన్న పోలీసులు అతడిని వెంటనే పట్టుకున్నారు. దీంతో ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన జడ్జి ఆర్‌కె దేశ్‌పాండే ఇది చాలా తీవ్రమైన విషయమని, జడ్జి వ్యక్తిగత రక్షణకే కాక, న్యాయవ్యవస్థకు కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు.