క్రైమ్/లీగల్

రైలు ఢీకొని ఇద్దరు గ్యాంగ్‌మెన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, డిసెంబర్ 27: చెన్నై-బెంగళూరు రైల్వేమార్గంలో కుప్పం శివారు కర్నాటక రాష్ట్రం బంగారుపేట తాలుకా వరదపుర రైల్వేగేటు సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు గ్యాంగ్‌మెన్లు మృతి చెందారు. బంగారుపేట రైల్వే పోలీసుల సమాచారం మేరకు ప్రతిరోజు మాదిరిగా బుధవారం రాత్రి కామసముద్రం రైల్వేస్టేషన్ నుంచి ఇద్దరు రైల్వేగ్యాంగ్‌మెన్లతోపాటు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న యువకుడు రైల్వేట్రాక్‌పై నడుచుకుంటూ ట్రాక్ స్థితిగతులను క్షుణంగా పరిశీలిస్తూ వచ్చారు. ఇద్దరు ఒక ట్రాక్‌పై, మరో వ్యక్తి ఇంకో ట్రాక్‌పై వెళ్తున్న సమయంలో పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న రైలును వీరు గమనించక పోవటంతో రైలుకింద పడి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పక్క ట్రాక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గమనించి రైల్వే ఉన్నతాధికారులకు విషయం తెలిపాడు. చనిపోయిన వారిలో ఒకరు రాజస్థాన్‌కు చెందిన గాంగ్‌మెన్ సింగ్‌మీనా(47), మరో యువకుడు చిత్తూరు జిల్లా శాంతీపురం మండలం సీ.బండపల్లి గ్రామానికి చెందిన రామస్వామి(19)గా గుర్తించారు. ద్రవిడ విశ్వవిద్యాయంలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న రామస్వామి కుటుంబ పరిస్థితులు బాగలేకపోవడంతో రాత్రివేళల్లో కాంట్రాక్టు పద్ధతిపై రైల్వే గాంగ్‌మెన్‌గా పనిస్తున్నాడు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం బంగారుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.