క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఆళ్లగడ్డ తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, డిసెంబర్ 27: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్ శేషఫణి ఏసీబీ అధికారులకు చిక్కారు. శేషఫణిపై గతంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో గురువారం ఐదు బృందాలు ఏకకాలంలో శేషఫణి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. నంద్యాల పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న శేషఫణి ఇంటికి గురువారం ఉదయం 6 గంటలకు చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదు, ఆభరాణాలు, అక్రమ ఆస్తులను గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, సీఐ నాగభూషణం, మరో నలుగురు సీఐలు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు జరిపాయి. నంద్యాల పట్టణంలో నాలుగు బృందాలు, ఆళ్లగడ్డలోని ఇంట్లో ఒక బృందం సోదాలు నిర్వహించాయి. నంద్యాలలోని శేషఫణి ఇంటితోపాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో సైతం సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ.11.75 లక్షల నగదు, అర కిలో బంగారం, బండి ఆత్మకూరులో 1.50 ఎకరాల సాగుభూమి, నంద్యాల పట్టణంలో మూడు ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు, ఒక అపార్టుమెంటు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. సోదాలు జరుగుతున్నాయని శుక్రవారం తహసీల్దార్ శేషఫణి అక్రమ ఆస్తుల మార్కెట్ విలువ తెలియజేస్తామన్నారు. శేషఫణిని అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు.