క్రైమ్/లీగల్

వృద్ధురాలి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడరూరల్,డిసెంబర్ 27: వేములవాడ మండలం సంకెపల్లి గ్రామంలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న పండుగ లచ్చవ్వను (70సం) ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బండరాళ్లతో మోది చంపారు. ఈ మేరకు మృతురాలి పెద్దకొడుకు చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బుధవారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు సంకెపల్లిలో నివాసం ఉంటున్న పండుగ లచ్చవ్వ ఇంట్లో ప్రవేశించే ముందు సమీపంలోని ఆమె కొడలు ఇంటికి బెడం పెట్టి.. వృద్దురాలు లచ్చవ్వ ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న లచ్చవ ముఖంపై బండరాళ్లతో మోది.. తీవ్రంగా గాయపరిచారు. ఏవో అరుపులు వినిపిస్తున్నాయని.. ఉల్లిక్కిపడి లేచిన లచ్చవ్వ కొడలు భాగ్య తన ఇంటి తలుపుతీసుకొని బయటకు రావాడానికి ప్రయత్నించింది.అయితే ఆమె ఇంటి తలుపులకు బెడం వేసి ఉండటంతో తాళులు తెరుచులేదు.దీంతో ఆమె వెంటనే వేములవాడ పట్టణంలోని వాసవీనగర్లో నివాసం ఉంటున్న తన బావ ఐన చంద్రయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే వారు హుటహుటిన వేములవాడ నుంచి సంకెపల్లికి చేరుకొని లోనికి వెళ్లి చూడగా... రక్తపుమడుగులో లచ్చవ్వ మంచపై పడి ఉండటాన్ని గమనించారు.దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రాల నేపంతోనే పండుగ లచ్చవ్వను ఓ పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.