క్రైమ్/లీగల్

మాజీ మంత్రి గొర్లె ప్రకాశరావు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, డిసెంబర్ 28: సీనియర్ గిరిజన నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ అటవీశాఖ మంత్రి గొర్లె ప్రకాశరావు (76) అనారోగ్యంతో అమెరికాలో శుక్రవారం మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం చట్లవాడ గ్రామానికి చెందిన ప్రకాశరావుకు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పండాదాస్ ఐఏఎస్ అధికారి. ప్రకాశరావు దంపతులు కొంతకాలంగా అమెరికాలో కుమార్తెవద్ద ఉంటున్నారు. కాగా ప్రకాశరావు అనారోగ్యంతో అమెరికాలోని ఆయన కుమార్తె గృహంలో మృతిచెందినట్లు ఆయన సోదరుడు గొర్లె పరమానందరావు తెలిపారు. ప్రకాశరావు గతంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఎల్లవరం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. ఆయన దివంగత అంజయ్య క్యాబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రకాశరావు మరణంతో చట్లవాడలో విషాదఛాయాలు ఆలుముకొన్నాయి. వనవాసీ స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు గొర్లె అనుదీప్‌కుమార్, జిల్లా వాల్మీకి నాయకులు గొర్లె నారాయణ, ఎంపీటీసీ గొర్లె అనిల్‌ప్రసాద్ తదితరులు ప్రకాశరావు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.