క్రైమ్/లీగల్

గంజాయి పట్టివేత :ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 29: నిషేధ గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.5 కిలోల డ్రై గంజాయితో పాటు హోండా ఆక్టివా, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరూర్‌నగర్ చైతన్యపురి ప్రభాత్‌నగర్‌లో నివసిస్తున్న ఎన్.వెంకట్ సాయి (18), కొత్తపేట్ లక్ష్మీనగర్‌కు చెందిన కే.సాయి (18), న్యూ మారుతీనగర్‌లో నివసిస్తున్న నేత విశాల్ సైమన్ (20) ముగ్గురు కలిసి నాగోల్ కొత్తపేట్ రోడ్డులో రహస్య ప్రదేశంలో గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం ప్రకారం.. ఇన్‌స్పెక్టర్ ఎస్.చంద్రశేఖర్ గౌడ్, డీటీఎఫ్ ఈఐ ఎస్.శ్రీనివాస్ సిబ్బంది కలిసి ఆకస్మిక తనిఖీ చేసి పై ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మత్తు మందుకు అలవాటు పడ్డ యువకులు గంజాయిని కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో 60గొర్రెలు మృతి
కొందుర్గు, డిసెంబర్ 29: రోడ్డు ప్రమాదంలో 60గొర్రెలు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి కొందుర్గు మండల పరిధిలోని రామచంద్రపూరం వద్ద చోటు చేసుకుంది. కొందుర్గు ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా పక్కన ఉన్న గ్రామానికి చెందిన గొర్రె కాపరులు మేతకోసం కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ మీదుగా రామచంద్రపూర్ గ్రామం వద్ద షాద్‌నగర్-పరిగి రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాలు ఒక్కసారిగా రావడంతో బెదిరిపోయిన గొర్రెలు రోడ్డు పక్కన మిషన్ భగీరథ గుంతలో పడి 60గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కొందుర్గు పోలీసులు తెలిపారు. ఎంత మందికి రైతులకు సంబంధించిన గొర్రెలు మృత్యువాత పడ్డాయనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. రోడ్డు ప్రమాదంలో 60గొర్రెలు మృతి చెందడంతో రైతుల కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. మేత కోసం సుమారు 50కిలో మీటర్ల దూరం తీసుకువచ్చిన నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో అన్నదాతలు బోరున విలపించారు.