క్రైమ్/లీగల్

కిడ్నాపైన బాలుడి కోసం ముమ్మర గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 29: తిరుమలలో మాధవ నిలయం వద్ద తల్లిదండ్రుల ఒడిలో నిద్రపోతూ శుక్రవారం కిడ్నాప్‌కు గురైన మహారాష్టక్రు చెందిన 16 నెలల వీరేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. నిందితుడికి సంబంధించి సమాచారం సేకరించడంలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. నిందితుడు నెల్లూరువాసిగా గుర్తించారు.బాలుడ్ని శుక్రవారం ఉదయం 6.30 నుంచి 7గంటల మధ్య అపహరించిన నిందితుడు ఉదయం 8.53 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌లో కౌంటర్ వద్ద టిక్కెట్ కొని వెళుతున్న దృశ్యాలు సీసీ టీవీ పుటేజ్‌లో నమోదయ్యాయి. నిందితుడు గుంతకల్ వైపు వెళ్లే రైలులో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గుంతకల్లుకు వెళ్లాడా...మార్గమధ్యంలో మరెక్కడైనా దిగి మరోవైపు వెళ్లాడా అన్న విషయంపై కూడా పోలీసులు మార్గమధ్యంలోని రైల్వేస్టేషన్‌లో ఉన్న పుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నిందితుడు తిరుమలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించి వదిలేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిందితుడు నెల్లూరువాసి అని విచారణలో తేలింది. కాగా నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు వీలుగా టీటీడీ యాజమాన్యం పోలీసులకు ఆరు వాహనాలను కూడా సమకూర్చింది. ఈ నేపథ్యంలో అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసుబృందాలు అనంతపురానికి వెళ్లాయి. ఇదిలా ఉండగా బిడ్డ ఆచూకీ దొరకకపోవడంతో వీరేష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చిత్రాలు.. కిడ్నాపైన బాలుడు, తిరుపతి రైల్వేస్టేషన్ సీసీ ఫుటేజ్‌లో కనబడిన నిందితుడు