క్రైమ్/లీగల్

ఎసీబీ వలలో హౌసింగ్ ఏఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 29: ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద నిర్మించుకుంటున్న ఇంటికి బిల్లు మంజూరు చేసేందుకు రూ. 10వేల లంచం స్వీకరిస్తూ గృహనిర్మాణ సంస్థ ఏఈ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సుధాకరరావు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో లబ్ధిదారుడి నుంచి రూ. 10వేల లంచం స్వీకరిస్తూ ఏఈ కెవి రమణ అవినీతి అధికారులకు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డారు. రైల్వేలో మంచినీటిని విక్రయించే యర్రంశెట్టి ఆనందకుమార్ అతని తల్లి నిర్మిల పేరిట 16వ డివిజన్‌లోని మేకల కబేళా వద్ద 28 గజాల సొంత స్థలంలో ఎన్టీఆర్ గృహానికి 2017లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంటి నిర్మాణంలో భాగంగా దఫదఫాలుగా రూ. లక్ష సొమ్ము మంజూరైంది. చివరగా రూ. లక్షన్నర మంజూరు కావాల్సి ఉంది. ఈ సొమ్ము మంజూరు చేసేందుకు ఏఈ రమణ రూ. 15వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే రూ. 5వేలు ఇచ్చేందుకు ఆనందకుమార్ అంగీకరించారు. రమణ 10వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శనివారం లంచం సొమ్ము ఆనందకుమార్ ఏఈకి ఇస్తుండగా డీఎస్పీ సుధాకరరావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రమణను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.