క్రైమ్/లీగల్

కుటుంబం అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.కోటపాడు, డిసెంబర్ 30: పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా సంచలం సృష్టించింది. ఈ సంఘటనలో భర్త, కుమారుడు, కుమార్తె మృతి చెందగా, భార్య విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతోంది. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కె.సంతపాలెం శివారు చంద్రయ్యపేట వద్ద అదే గ్రామానికి చెందిన సబ్బవరపు కన్నంనాయుడు ఐదు నెలల నుండి కోళ్లఫారం నిర్వహిస్తున్నాడు. అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ శివారు బుడ్డిగరువు గ్రామానికి చెందిన పాంగి చిన్నారావు తన భార్య ఇద్దరు పిల్లలతో కోళ్లఫారంలో పనిచేస్తూ అక్కడే జీవిస్తున్నారు. యజమాని ఆదివారం ఉదయం కోళ్లఫారానికి వచ్చి చిన్నారావును పిలిచినా పలకకపోవడంతో కిటికీలోనుండి చూడగా చిన్నారావు, భార్య, ఇద్దరు పిల్లలు కిందపడి ఉన్నట్లు కనిపించారు. గ్రామస్థులను వెంటబెట్టుకొని వచ్చి తలుపులు తెరిచి భర్త, పిల్లలు మరణించినట్లు గుర్తించి, చావుబ్రతుకుల్లో ఉన్న పాంగి లక్ష్మిని విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. సిపిఎం నాయకులు కేతా దేముడు, సిహెచ్.రాజు మృతుల బంధువులకు న్యాయం చేసే వరకు మృతదేహాలు తరలించరాదని, పోలీసులకు ఫిర్యాదు చేయరాదని భీష్మించుకోవడంతో మధ్యాహ్నం 4 గంటల వరకు మృతదేహాలను తరలించలేదు. దీంతో సిఐ శ్రీనివాసరావు జోక్యం చేసుకొని బంధువులకు నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎ.కోడూరు ఎస్.ఐ. ఎన్.నారాయణరావు, ట్రైనీ ఎస్.ఐ. మహమ్మద్ ఆలీ, చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న మృతుని తల్లి పాంగి వరాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చోడవరం సిఐ తెలిపారు.

చిత్రం..మృతి చెందిన పాంగి చిన్నారావు, ఇద్దరు పిల్లలు