క్రైమ్/లీగల్

రాళ్లదాడిలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 30: యూపీలో ఒక పోలీసును చంపిన కేసులో 19 మందిని అరెస్టు చేసినట్టు ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ ట్విటర్‌లో తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేష్ ప్రతాప్ సింగ్ వాట్స్ (48) ప్రధాని ఘజియాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభ బందోబస్తు ముగిసిన అనంతరం శనివారం రాత్రి పోలీసులు తిరిగి వస్తుండగా ఘజియాపూర్ జిల్లాలో కొందరు అల్లరి మూకలు ట్రాఫిక్‌కు నిలిపివేసి నిరసన తెలిపారు. వారిని నిరోధించడానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్ ప్రతాప్ సింగ్ వాట్స్ తలకు గాయమై మృతి చెందారు. రాళ్లదాడికి పాల్పడిన వారు రాష్ట్రీయ నిషాద్ పార్టీకి చెందిన కార్యకర్తలుగా గుర్తించామని, ఇప్పటివరకు 19మందిని అరెస్ట్‌ చేశామని, వీరిలో 11మందిపై హత్యకేసు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. మిగిలిన నిందితులను వీడియోఫుటేజ్ ఆధారంగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇలావుండగా రాళ్ల దాడిలో వాట్స్ మృతిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర సంతాపం తెలిపారు. మృతుడి భార్యకు 40 లక్షలు, అతని తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని ఆయన ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. ఇలావుండగా యూపీలోనే ఇటీవల జరిగిన మూకదాడిలో బులందశహర్ జిల్లాలో సుబోధ్‌కుమార్ అనే ఇన్‌స్పెక్టర్ మృతి చెందిన సంగతి తెలిసిందే.