క్రైమ్/లీగల్

న్యూ ఇయర్ వేడుకల్లోవిషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి టౌన్, జనవరి 1: న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి ముగ్గురు యువకలు సోమవారం రాత్రి బైక్‌పై వెలుతూ డ్రైనేడీ కాలువలో పడి ఒకరు మృతి చెందగా ఇద్దరుకి గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన గణేష్ నాయుడు, మహేష్, మనోజ్ నాయుడులు సుమారు 26 సంవత్సరాలు కలిగిన యువకులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి తుమ్మపాల గోదావరి కాలువ ఆనుకోని ఉన్న బొజ్జన్న కొండ రోడ్డున వెళ్తుండగా రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు మధ్యలో డ్రైనేజీ కాలువ ఉండటంతో అది గమనించని వీరు నేరువెళ్లి కాలువలో బైక్‌తో పాటు పడిపోయారు. ఈ ప్రమాదంలో గణేష్‌నాయుడు మృతి చెందగా మహేష్,మనోజ్‌నాయుడులు గాయాలతో బయటపడ్డారు. రోడ్డుకి ఇరువైపులా లైటింగ్ లేకపోవడం, అక్కడ నిర్మాణపనులు జరుగుతున్నట్లు హెచ్చరిక బోర్డు పెట్టకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో కొత్తసంవత్సరం రోజున చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందడం తుమ్మపాల గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ మేరకు ట్రాఫిక్‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తాలో ఇద్దరికి గాయాలు
హుకుంపేట, జనవరి 1: మండలంలోని గడుగుపల్లి గ్రామం వద్ద మంగళవారం ఆటో బోల్తా పడి ఇద్దరు గాయాలపాలయ్యారు. పాడేరు నుంచి అరకులోయకు ఐస్ క్రీం తీసుకువెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అడ్డుమండ గ్రామానికి చెందిన మజ్జి ప్రమీల, ఆటో డ్రైవర్ మణికంఠ గాయాలకు గురయ్యారు. గాయపడిన వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హుకుంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.