క్రైమ్/లీగల్

సీబీఐ వలలో ఐదుగురు సైనికాధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అస్నో, అరుణాచల్ ప్రదేశ్‌లో సైనికులకు రేషన్‌ను సరఫరా చేసే వ్యక్తుల నుంచి రూ.18 లక్షల లంచం తీసుకుంటున్న ఐదుగురు సైనికాధికారులను సీబీఐ వల పన్ని పట్టుకుంది. లంచం తీసుకుంటున్న వారిలో కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఈ ఐదుగురు సైనికాధికారులపై సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. అవినీతికి పాల్పడినందుకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు. కల్నల్ రమణ్ దహడా, లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర కుమార్, సుబేదార్ దేవందర్ కుమార్, హవాల్దార్ అభయ్ సింగ్, సుబేదార్ సుహురన్ సాహు, సప్లయర్ కేకే యాంగ్ఫో ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సైనికులకు రేషన్ సరఫరా చేసేందుకు సివిల్ కాంట్రాక్టులు ఉంటారు. వీరి వద్ద నుంచి సైనికాధికారులు రేషన్ కొనుగోలు చేస్తారు. వీరి వద్ద నుంచి రూ.18 లక్షల లంచం తీసుకుంటుండగా సమాచారం మేరకు దాడి చేసి సైనికాధికారులను పట్టుకున్నట్లు సీబీఐ పేర్కొంది. కాంట్రాక్టర్ నుంచి కల్నల్ రమణ్ దహడా రూ.4.5 లక్షల సొమ్ము తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల నాణ్యతను నిర్ధారించాల్సిన లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర కల్నల్ కూడా అవినీతిలో పాలుపంచుకున్నారని సీబీఐ అధికారులు తెలిపారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి రూ.1 లక్ష లంచం తీసుకున్నారన్నారు. యాంగ్ఫో అనే కాంట్రాక్టర్ 2015 నుంచి సైనికులకు రేషన్ సరఫరా చేస్తున్నాడు. సైనికాధికారులు రేషన్ నాణ్యత విషయంలో రాజీపడ్డారని విచారణలో తేలింది. 2012 నుంచి 2016 మధ్య ఈ తరహా స్కాం ఇక్కడ జరిగింది. అప్పట్లో రూ.82 లక్షల లంచం తీసుకున్న లెఫ్టినెంట్ కల్నల్‌లు సుతీక్షన్ రాణా, అమిత్ శర్మలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.