క్రైమ్/లీగల్

ఉచిత విద్యుత్‌పై నిర్ణయం తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 2: గోశాలలకు ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్ పథకాన్ని పరిశీలించి దానిని కొనసాగించాలో రద్దు చేసుకోవాలో నిర్ణయించాలని పంజాబ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్టరయిన గోశాలలకు ఉచితంగా విద్యుత్‌ను అందించాలని, గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రిజిస్టరయిన గోశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేయడం లేదని, అంతేకాకుండా పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించమని నోటీసులు సైతం జారీ చేసిందని జైమాతా వైష్ణో గృహశాల సొసైటీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై చీఫ్ సెక్రటరీ, పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నేతృత్వంలోని కమిటీని నిర్ణీత కాలవ్యవధిలో ఈ అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని జస్టిస్ రంజన్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సొసైటీ తరఫున వాదిస్తున్న న్యాయవాది ఆదర్శ్ జైన్ బుధవారం తన వాదన వినిపిస్తూ ఒక పక్క ప్రభుత్వం ప్రజల నుంచి కౌ సెస్‌ను వసూలు చేస్తోందని, అయినా రిజిస్టరయిన గోశాలలకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడం లేదని, పైగా పాతబకాయిలు చెల్లించమంటూ నోటీసులు జారీ చేస్తోందని తెలిపారు. దీనిపై స్టేట్ కౌన్సిల్ సమాధానమిస్తూ పాతబకాయిలు వసూలు చేయమంటూ ఈ రోజు వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, అలాగే గోశాలల విద్యుత్‌కనెక్షన్లను కట్ చేయలేదని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పరిశీలించాలని, గోశాలలకు ఉచితంగా సరఫరా చేయాలా వద్ద అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.