క్రైమ్/లీగల్

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జనవరి 10: ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటనపై పోలీసులు సుమోటగా కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారు జామున మండల పరిధిలోని తంగిళ్లపల్లి గ్రామంలో సంఘటనపై సుమోటగా కేసు నమోదు చేసినట్లు కొందుర్గు ఎస్‌ఐ శ్రీను తెలిపారు. తెల్లవారుఝామున మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు స్వర్గీయ ఎన్‌టీఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పింటించారని, గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను బంద్ చేసి ఈ సంఘటనకు పాల్పడినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనపై సుమోటగా కేసు నమోదు చేసి నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.