క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన పరిశ్రమల శాఖ జీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 10: మహబూబాబాద్ జిల్లాకేంద్రంపై మరోసారి ఏసీబీ అధికారులు వల విసిరారు. ఈసారి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం వేముల వీరేశం రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. మానుకోటలోని పెద్దవంగర మండలం మేట్యతండా శివారు ఈక్యతండాకు చెందిన గిరిజన రైతు దారావత్ భగ్న 2017లో సబ్సిడిపై వరి కోత యంత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2018లో అతనికి వరి కోత యంత్రం మంజూరైంది. గిరిజన రైతుకు రావాల్సిన సబ్సిడీ నగదు రావడంలో మాత్రం జాప్యం అవుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ నగదు కోసం అనేకమార్లు భగ్న జిల్లా పరిశ్రమల కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. రేపో మాపో అంటూ అధికారులు దాటవేయసాగారు. ఇదేక్రమంలో జిల్లాపరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వేముల వీరేశంను అనేకమార్లు భగ్న కలవడం జరిగింది. సబ్సిడి సొమ్ము త్వరగా రావాలంటే పై అధికారులకు కొంత లంచం ముట్టచెప్పాల్సి వస్తుందని, ఇతర ఖర్చులు ఉంటాయని చెప్పుకొచ్చిన వీరేశం రూ. 15వేలు డిమాండ్ చేసినట్లు భగ్న తెలిపారు. అనేకమార్లు బతిమిలాడి రూ.10వేలు ఇస్తానని భగ్న బతిమిలాడుకున్నారు. లంచం కోసం తనను వేధిస్తున్న అధికారిని ఎలాగైనా ఏసీబీ అధికారులకు పట్టించాలనే నిర్ణయానికి వచ్చిన భగ్న వారిని ఆశ్రయించాడు. పథకం ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం జిల్లా పరిశ్రమల శాఖ అధికారికి రూ.10వేలు లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. తనకు రావాల్సిన సబ్సిడీ కోసం లంచం ఇవ్వాలంటూ పదేపదే ఇబ్బంది పెట్టడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని గిరిజన రైతు ధారావత్ భగ్న తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐలు వాసాల సతీష్, వెంకటేష్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో జిల్లాస్థాయి అధికారి 10వేలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడ్డడని తెలియడంతో ఒక్కసారి పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వణుకు ప్రారంభమైంది. లంచం తీసుకునే అధికారుల సమాచారాన్ని తమకు ఇచ్చినట్లైతే కచ్చితంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఏసీబీ డీ ఎస్పీ భద్రయ్య తెలిపారు.