క్రైమ్/లీగల్

గుట్కాలపై టాస్క్‌‘్ఫర్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 10: టాస్క్ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ షాపులకు సరఫరాకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వలపై వరంగల్ పోలీస్ కమిషరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు గుట్కా వ్యాపారులను అరెస్ట్ చేయడంతోపాటు వారి నుండి 16 లక్షల రూపాయల విలువగల 40 బ్యాగులు, 72వేల నగదుతోపాటు, గుట్కా బ్యాగులను తరలించేందుకు వినియోగించే రెండు కార్లతో పాటు, ఒక బోలేరో వాహనాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో జనగామ జిల్లా నర్మెట్ట మండలం బోతేలబర్రే గ్రామానికి చెందిన సిద్దిరాజు, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన రాజుతో పాటు హైద్రబాద్ ప్రాంతానికి చెందిన బొద్దుల శ్రీనివాస్, లోరేల్, మాలి లక్ష్మణ్ ఉన్నారు.
అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ గురువారం వెల్లడించారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాలకు నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకేట్లను సరఫరా జరుగుతున్నట్లుగా టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో, టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవరి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది నర్మెట్ట మండలం బోతేలబర్రే గ్రామంలోని సిద్దం రాజు ఇంటిపై దాడులు నిర్వహించడంతో రవాణకు సిద్ధంగా ఉన్న గుట్కాల ప్యాకెట్ల గోదాములో నిల్వచేసిన వున్న గుట్కా బ్యాగులు లభించాయి. దీంతో సిద్దం రాజును పోలీసులు విచారించడంతో హైద్రబాద్ ప్రాంతానికి చెందిన రాజు, శ్రీనివాస్, లోరేల్, లక్ష్మణ్‌తో కలసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు కర్నాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలో గుట్కా, అంబర్ తయారీ కేంద్రాల నుండి కొనుగోళ్లు చేసి వాటిని రెండు కార్లు, బొలేరో వాహనం ద్వారా రాత్రి సమాయాల్లో నర్మెట్ట గ్రామానికి తరలించడం జరుగుతుందని ప్రధాన నిందితుడు అంగీకరించాడని సీపీ తెలిపారు.
గురువారం తెల్లవారు జామున నిందితులు నలుగురు బీదర్ నుండి గుట్కా బ్యాగులను మూడు వాహనాల్లో తరలిస్తున్నట్లుగా నిందితుడు ఇచ్చిన సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు నర్మెట్ట మండల శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గుట్కా బ్యాగులను తరలిస్తున్న వాహనాలను గుర్తించి నిందితులను అరెస్ట్ చేసి గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వచ్చే రోజుల్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో గుట్కా, మాట్కా, జూదం, వ్యభిచారం లాంటి కార్యకలపాలను నిర్వహించే వారిని కఠినంగా అణిచివేయాలని టాస్క్ఫోర్స్ సిబ్బందికి సూచించడంతోపాటు సిబ్బందిని సీపీ అభినందించారు. పోలీస్ కమిషనర్ అభినందించిన వారిలో ఏసీపీ చక్రవరి, ఇన్స్‌స్పెక్టర్ రమేష్‌కుమార్‌తోపాటు సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, క్రాంతి, శ్రీను, ఆలీ, వెంకన్నలు ఉన్నారు.
చిత్రం..టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా బ్యాగులను పరిశీలిస్తున్న సీపీ రవీందర్