క్రైమ్/లీగల్

మావోయిస్టు కొరియర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జనవరి 11: మావోయిస్టు పార్టీ కొరియర్‌గా పనిచేస్తున్న బత్తుల ప్రకాష్ అలియాస్ ప్రదీప్‌ను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి పిస్టల్, ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన బత్తుల ప్రకాష్‌ను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విలేఖరుల ఎదుట హాజరుపరిచారు. ప్రకాష్ అరెస్ట్ వివరాలను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి విలేఖరులకు తెలిపారు. బత్తుల ప్రకాష్ అలియాస్ ప్రదీప్ 0.32 పిస్టల్, ఆరు తూటాలతో మావోయిస్టు నేత హరిభూషణ్‌ను కలవడానికి వెళ్తుండగా కొత్తగూడ మండలంలోని గుంజెడు ముసలమ్మ ఆలయం వద్ద పోలీసులకు చిక్కినట్లు తెలిపారు.