క్రైమ్/లీగల్

స్పా, మసాజ్ సెంటర్లపై టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 12: నగరంలోని మసాజ్ సెంటర్లపై పోలీసులు దృష్టి సారించారు. స్పా, మసాజ్ మాటున అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ బృందాలు శనివారం సాయంత్రం పలుచోట్ల దాడులు నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్, సిఐ సురేష్‌రెడ్డి బృందం సూర్యారావుపేట, మాచవరం పోలీస్టేషన్ల పరిధిలోని మసాజ్, స్పా సెంటర్లతోపాటు బందరురోడ్డులోని ప్రముఖ షాపింగ్ మాల్ పివిపిలోని మసాజ్ సెంటర్‌పై దాడి చేశారు. నగరంలోని అన్ని సెంటర్లపై తనిఖీలు జరుపగా.. రెండు చోట్ల ఈ తరహా కార్యకలాపాలతో నిర్వహకులు పట్టుబడ్డారు. క్రాస్ మసాజ్ చేస్తూ దొరికిపోవడంతో మొత్తం 16మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు కస్టమర్లు, ఎనిమిది మంది బాధితులు, ముగ్గురు ఆర్గనైజర్లు ఉన్నారు. వీరిలో ధాయిలాండ్‌కు చెందిన ఐదుగురు, ఇద్దరు నార్త్ ఇండియన్స్ ఉన్నారు. నిందితుల నుంచి లక్షా 17వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ బృందాలు నిందితులతో సహా సూర్యారావుపేట, మాచవరం పోలీసులకు అప్పగించారు.