క్రైమ్/లీగల్

తిరుచానూరు ఎస్‌ఐ దెబ్బలకు యువకుని తీవ్రగాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 14: తిరుచానూరు ఎస్‌ఐ రామాంజనేయులు లాఠీ విరిగేంత వరకు కొట్టడంతో నందకిశోర్ (24) అనే యువకుడి ఎడమ చేతి ఎముక విరగడంతో పాటు అతని శరీరంపై వాతలు లేచాయి. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాధితుడు నందకిషోర్ మాట్లాడుతూ తన మిత్రులకు సంబంధించిన ద్విచక్రవాహనాన్ని తిరుచానూరు పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఆ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లను తాను ఆదివారం తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లానని చెప్పారు. వాహనాన్ని ఇవ్వక పోగా తమను స్టేషన్లో పెడితే మిగిలివారు వస్తారని పదే పదే సిబ్బందికి ఎస్‌ఐ చెబుతూ, దుర్భాషలాడటంతో తాను ఎస్‌ఐ తీరును ప్రశ్నిస్తూ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పానన్నారు. దీంతో రెచ్చిపోయిన ఎస్‌ఐ లాఠీతో తనను గొడ్డును బాదినట్లు బాదారని, చెప్పుకోలేని ప్రదేశంలోను చేతిపైన వీపుపైన, తొడలపైన తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని కోరినా వినకుండా తన రూ. 42,200 విలువ చేసే రెండు ఫోన్లను పగలగొట్టారని వాపోయాడు. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు వెళ్లిన తనను రాత్రి 9.30 గంటల వరకు స్టేషన్లో నిర్బంధించాడని వివరించారు. తన చేతి ఎముక విరగడంతో రుయాలో చికిత్స తీసుకున్నానని, అలిపిరి పోలీసులు వచ్చి తన వద్ద వాంగ్మూలం కూడా తీసుకున్నారన్నారు. ఎస్‌ఐ తీరుపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.