క్రైమ్/లీగల్

పాకాలలో అల్లుడిని కత్తితో పొడిచిన మామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 14: పండగలంటే ఇంటికి వచ్చే అల్లుళ్లకు ఎనలేని గౌరవం ఇస్తారు. అయితే మద్యం సేవించి వచ్చి దుర్భాషలాడటంతో మామే అల్లుడిని కత్తితో పొడిచిన సంఘటన పాకాల మండలం తలారిపల్లిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. గాయపడ్డ అల్లుడిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. సీఐ హరినాథ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతికి అల్లుడు వచ్చాడని మామ మణి (67) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోడి కూర వండి వడ్డించేందుకు సిద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో అల్లుడు నరేష్ (23) ఫూటుగా మద్యం సేవించి వచ్చి మామను దుర్భాషలాడాడు. పండగ రోజు అల్లుడి ప్రవర్తనతో మామ మణి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కోడిని కోస్తున్న కత్తితో అల్లుడి ఛాతిపైన, డొక్కలో పొడిచాడు. దీంతో నరేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.