క్రైమ్/లీగల్

ఇంత దౌర్భాగ్యమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ( జగన్మోహన్ రెడ్డిసోదరి) షర్మిల నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం షర్మిల తన భర్త అనిల్ కుమార్, పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో కలిసి నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిసి ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సినీ నటుడు ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులపై చర్య తీసుకోవాలంటూ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. షర్మిల ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ అంజనీ కుమార్ వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సైబర్ క్రైం అదనపు
డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఏపీ పోలీసులపై నమ్మకం లేకే..
అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేకే హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల చెప్పారు. సినీ నటుడు ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని ఒక వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారం చేస్తున్నదని ఆమె బాధను వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె అన్నారు. కొంత కాలం ఆపేసిన ఆ వర్గం ఇప్పుడు మళ్లీ సామాజిక మాద్యమాల్లో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతోందని ఆమె ఆవేదన చెందారు. ఇది తన ఒక్కదానికే అవమానం కాదని, ఇలాంటి రాతలను అనేక మంది మహిళలు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి వంటి ఎన్నో నినాదాలు ప్రసంగాలకు, పేపర్లకే పరిమితం అవుతున్నాయని ఆమె ఆవేదనగా అన్నారు. నైతికత ఉన్న రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మహిళలు తన ఫిర్యాదును బలపరచాలని ఆమె కోరారు. తాను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా తన నైతికతను, నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తన గురించి తనకు తెలుసునని అన్నారు. అయితే తన గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంది కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియాకు చెబుతున్నానని షర్మిల పేర్కొన్నారు. ప్రభాస్‌ను కనీసం ముఖాముఖిగా ఎదురు కాలేదని తన పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నానని షర్మిల స్పష్టం చేశారు.
చిత్రం..హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేస్తున్న షర్మిల